‘రెయిన్ బో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ‘లెజెండ్’ లో బాలయ్య సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ సోనాల్ చౌహన్.. ఈ చిత్రం తర్వాత అమ్మడు ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘డిక్టేటర్‘,’రూలర్‘ చిత్రాల్లో కనిపించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోనాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేయడం అమ్మడి ప్రత్యేకత.. ఇటీవల చీరకట్టులో అసలు సిసలు తెలుగందం అనిపించేలా మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా హాట్ లుక్ లో దర్శనమిచ్చి కుర్రకారు మతి పోగొట్టేసింది.
బ్లాక్ అండ్ బ్లూ జీన్స్ అవుట్ ఫిట్ లో బెడ్ పై కూర్చొని సెక్సీ లుక్ తో ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది. టాప్ అండ్ బాటమ్ .. బ్లాక్ అండ్ బ్లూ దుస్తుల్లో సోనాల్ మంటలు రేపుతోంది. ఇక ఈ ఫోటోలకు అమ్మడు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘సూర్యుడు నన్ను ముద్దాడడానికి మళ్లీ అనుమతినిచ్చాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సోనాల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ లో మూడో కథానాయికగా నటిస్తోంది. మరి అమ్మడు అందచందాలు ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయో చూడాలి.
