Soldier 24×7: చేతిలో తుపాకీ, గుండెల్లో త్రివర్ణ పతాకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. అదే దారిలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే వీర జవానుల కథతో, సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న చిత్రం “సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ”. ‘కొనంకి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దేశభక్తి, ధైర్యం, త్యాగం మరియు కర్తవ్య నిబద్ధతను ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో కొనంకి కార్తీక్ పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ సైనికుడి పాత్రలో ఆకట్టుకుంటున్నారు. పోస్టర్ వెనుక యుద్ధ వాతావరణం, భీకర పోరాట ఛాయలు, వాటి మధ్య గర్వంగా రెపరెపలాడుతున్న మన భారత త్రివర్ణ పతాకం సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో క్లియర్ హింట్ ఇచ్చేసింది. ఈ లుక్ చూశాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి. “ముఖ్యంగా ’24×7 ఆన్ డ్యూటీ’ అనే ట్యాగ్‌లైన్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే.. అక్కడ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత సైనికుల రక్తాన్ని, చెమటను ఈ చిత్రం ద్వారా ఘన నివాళిగా చూపించబోతున్నారు.”
Also Read
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో హీరో!
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- Ramayana Part 2: రణ్‌బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
ఈ విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ను డైరెక్టర్ శ్రద్ధ ఖత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కేవలం దేశభక్తి ఫైట్లు మాత్రమే కాకుండా, గుండెలను పిండేసే బలమైన భావోద్వేగాలు, మానవీయ విలువలు కూడా మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఈ చిత్రంలో కొనంకి కార్తీక్ సరసన ప్రియాంక వర్మ హీరోయిన్గా నటిస్తోంది. నిర్మాత కె. వి. నాయుడు ‘కొనంకి ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై ఎక్కడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తోనే గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ ‘సోల్జర్’ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ అప్డేట్స్ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!