Site icon NTV Telugu

Salman Khan: సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి పెళ్లి అచ్చి రాలేదా..?

Salman

Salman

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదా..? అంటే నిజమే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు. ఎందుకంటే ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు.. ఇక పెళ్లైన అతడి తమ్ముళ్లకు పెళ్లి నిలబడలేదు. ఇప్పటికే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ భార్య మలైకాకి విడాకులు ఇచ్చిన విషయం విదితమే.. మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక అంటూ తన అందాలతో కేక పెట్టించిన ఈ అమ్మడు భర్త నుంచి విడిపోయాక తనకన్న చిన్నవాడు అయిన హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ సాగిస్తోంది. ఇప్పటికీ వీరి రిలేషన్ బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తూనే ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సల్మాన్ చిన్న తమ్ముడు కూడా భార్యతో విడిపోవడానికి రెడీ అయిపోయాడు. బాలీవుడ్ లో సల్మాన్ చిన్న తమ్ముడు సోహైల్ ఖాన్ అతడి భార్య సీమా ఖాన్‌లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. 1998లో సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 24 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా వీరు విడాకులకు దరఖాస్తు చేసుకోవడం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సల్మాన్ ఫ్యామిలీకి పెళ్లి అచ్చి రాలేదంటూ బీ టౌన్ లో చర్చలు మొదలయ్యాయి.

Exit mobile version