NTV Telugu Site icon

Love – Sitara: లవ్ సితార అంటున్న నాగచైతన్య కాబోయే భార్య

Love Sitara

Love Sitara

ZEE5 నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ ఫ్యామిలీ డ్రామా తెర‌కెక్కింది. ఓ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను, ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే… ప్ర‌కృతి అందాల‌తో ఆక‌ట్టుకునే కేరళ పచ్చటి అందాల న‌డుము తెర‌కెక్కిన క‌థే ల‌వ్ సితార‌. తార‌ (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమ‌లో పడుతుంది.

Utsavam Movie Telugu Review : ఉత్సవం రివ్యూ

వారిద్ద‌రూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళ‌తారు. అక్క‌డ పెళ్లి జ‌రగ‌టానికి ముందు కుటుంబాల్లోని విబేదాలు, తెలియ‌కుండా దాగిన నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. చివ‌ర‌కు ఈ జంట ప్ర‌యాణం ఎటువైపు సాగింద‌నేదే సినిమా. సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. లవ్, సితార సెప్టెంబర్ 27న ZEE5లో ప్రీమియర్‌గా ప్ర‌ద‌ర్శితం కానుంది.ఈ సంద‌ర్భంగా శోభితా దూళిపాల‌ మాట్లాడుతూ,‘‘సితారలో నటిచడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్య‌మైన పాత్ర‌. స్వ‌తంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ పాత్ర‌లో న‌టించాను. నిజాయ‌తీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంద‌నేదే క‌థ‌. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి”అని అన్నారు.

Show comments