Site icon NTV Telugu

Sobitha Dhulipala: నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శృంగారం సీన్స్.. మరీ ఇంత ఘాటుగానా

Sobitha

Sobitha

Sobitha Dhulipala: అచ్చ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యిందో లేదో తెలియదు కానీ, నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అన్న పుకారుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. బాలీవుడ్ నుంచి గూఢచారి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన శోభితా.. ప్రస్తుతం బాలీవుడ్ లో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించింది. అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ది నైట్ మేనేజర్ హాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఇక సీజన్ 1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యి మంచి హిట్ టాక్ నే అందుకుంది.

Sai Pallavi: సినిమాలకు సాయి పల్లవి బ్రేక్.. ఇదే కారణమా.. ?

ఇక జూన్ 29 న సీజన్ 2 రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో శోభితా రొమాంటిక్స్ సీన్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సిరీస్ లో అనిల్ కుమార్ యంగ్ వైఫ్ గా శోభిత నటించింది. మొదటి సీజన్ లో అనిల్ కపూర్ తో పెదవి పంచుకున్న శోభిత.. రెండో సీజన్ లో ఆదిత్య రాయ్ కపూర్ తో ఏకంగా బెడ్ నే పంచుకుంది. ఘాటు రొమాన్స్ లో మునిగి తేలింది. ఇంటిమేటెడ్ సీన్స్ లో ఘాటుగా కనిపించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సీన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు శోభితపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సీన్స్ లో నటించడం వలన అవకాశాలు వస్తున్నాయా..? ఎందుకు చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version