NTV Telugu Site icon

Sobhan Babu: విశాఖలో శోభన్‌బాబు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ

Sobhan Babu

Sobhan Babu

విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్‌ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్‌బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు.   తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్‌బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం, శోభన్‌బాబు ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ.సతీష్‌ కుమార్‌, విగ్రహ దాత జె.రామాంజనేయులు , రాశీ మువీస్‌ అధినేత ఎం.నరసింహరావు, సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి అధ్యక్షులు, మాజీ ఎం. ల్. సి. ఎం. సుధాకర్ బాబు, అఖిలభారత్ శోభన్ బాబు సేవాసమితి సభ్యులు పూడి శ్రీనివాస్, టి. వీరప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్. ఎన్. రావు, కె. శ్రీనివాసకుమార్, యు. విజయ్, టి. సాయికామరాజు తదితరులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత వీరంతా శోభన్‌బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విగ్రహ ఆవిష్కరణ చేసిన జె.రామాంజనేయులతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడుగా శోభన్‌బాబు ఎంతో గుర్తింపు పొందారన్నారు. ఆరు అడుగుల అందగాడుగా, కుటుంబ చిత్రాల కధానాయకుడిగా ఎన్నో సినిమాల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగారన్నారు. శోభన్ బాబు సినిమాల్లో సమాజానికి అవసరమైన ఎంతో సందేశం ఉండేదన్నారు. నాటి తరంతో పాటు నేటి తరం హిరోలకు శోభన్ బాబు ఆదర్శనీయంగా నిలిచారన్నారు. భౌతికంగా ఆయన లేక పోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలు ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా దాతలను విగ్రహ నిర్మాణ కమిటీ ఘనంగా సత్కరించింది.