NTV Telugu Site icon

Smriti Irani: సిగ్గులేదా.. నీకు అని అతడు నన్ను అవమానించాడు

Smriti

Smriti

Smriti Irani: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆమె తిరుగులేని మహిళగా కొనసాగుతున్నారు. ఇక ఆమె రాజకీయాల్లోకి రాకముందు ముందు ఆమె సీరియల్స్ నటించిందని తెలుసా..?. రామాయణ, విరుధ్: హరి రిష్తా ఏక్ కురుక్షేత్ర లాంటి సీరియల్స్ తో పాటు ఫ్యామి ద్రవం సీరియల్స్ లోను నటించి మెప్పించింది. తన మొదటి సీరియల్ సమయంలో తనను తన మేకప్ మ్యాన్ అవమానించడంటూ ఆమె తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. స్మృతీ మొదటి సీరియల్.. క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ. ఇక ఈ సీరియల్ చేసే సమయంలో ఆమె ఎలాంటి ఇబ్బందులు, అవమానాలు పడిందో.. ఆమె గుర్తుచేసుకున్నారు.

SSMB28: వచ్చేసింది.. వచ్చేసింది.. మహేష్ అప్డేట్ వచ్చేసింది

“క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ సీరియల్ కు నాకు రోజుకు రూ. 1800 ఇచ్చేవారు. అప్పుడు నా దగ్గర కారు కూడా లేదు. ఇక జుబిన్ తో నాకు పెళ్లి అయ్యాకా ఇద్దరికీ కలిపి రూ. 30 వేలు వచ్చేవి. అయినా నేను రోజూ సెట్స్ కు ఆటోలో వెళ్లేదాన్ని. ఒకరోజు నేను ఆటోలో రావడం చూసిన నా మేకప్ మ్యాన్.. నా దగ్గరికి వచ్చి.. నేను రోజూ కారులో వస్తున్నా.. నువ్వు ఇలా ఆటో వస్తున్నావ్.. సిగ్గుగా అనిపించడంలేదా.. ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని అనేశాడు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments