Site icon NTV Telugu

రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’

నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు.

‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా ఉంది. మేకర్స్ ‘సైరన్ ఆఫ్ దసరా’ అనే డైలాగ్ ప్రోమోను ఆవిష్కరించారు. బ్యాక్‌డ్రాప్‌లో తెలంగాణలోని అత్యంత ప్రజాదరణ పొందిన ‘బతుకమ్మ’ పాటతో ప్రారంభమైన ఈ వీడియోలో నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల్లో ‘దసరా’ పండగ జోష్ ను పెంచేసింది. “ఈ దసరా నిరుడు లెక్కుండది, బాంచన్ జమ్మి వెట్టి చెప్తాన్న బద్దల్ బాషింగాలైతయ్, ఎట్లైతే గట్లైతది, సూస్కుందాం” అంటూ అచ్చమైన తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్, ఆ వీడియో సినిమాపై ఆసక్తిని, అంచనాలను అమాంతం పెంచేశాయి.

Read Also : కన్నడ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ నెక్స్ట్

‘దసరా’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ సినిమా కథ గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంది. ‘దసరా’ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్ననటి కీర్తి సురేష్ నానితో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో ‘నేను లోకల్’ సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సాయి కుమార్, సముద్రకని, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు.

Exit mobile version