NTV Telugu Site icon

SKN: గణపతి లడ్డు.. లక్షల్లో పాడి సొంతం చేసుకున్న బేబీ నిర్మాత

Skn

Skn

SKN:బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు SKN. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో SKN లెవెల్ మారిపోయింది. బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్ లిస్టులోకి మారిపోయాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. SKN పెట్టిన ప్రతి రూపాయికి పది రెట్లు ఈ సినిమా అతనికి అందించింది. సినిమా రిలీజ్ రోజున, హిట్ అయిన రోజున అతను ఎంత ఉద్వేగానికి లోనయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Bhagavanth Kesari: బ్రో.. బాలయ్య డైలాగ్స్ అంటే .. ఆ మాత్రం ఉండాలి

ఇక తాజాగా గీత ఆర్ట్స్ లో గణేష్ లడ్డూ వేలం వేగా దాదాపు రెండు లక్షలు పాడి ఆ లడ్డును సొంతం చేసుకున్నాడు SKN. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను SKN షేర్ చేస్తూ.. ” ఈ ఏడాది గీతా ఆర్ట్స్ గణేష్ లడ్డూను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అందులోనూ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా ఈ లడ్డును అందుకోవడం మరింత ఆనందంగా ఉంది” అంటూ చెప్పకువచ్చాడు. ప్రస్తుతం బేబీ తరువాత మరో అద్భుతమైన కథను తెరమీదకు తీసుకురావడానికి ఈ నిర్మాత ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత తర్వాత సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

Show comments