రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యూత్‌లో ఈ సినిమా మంచి చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా క్లైమాక్స్ తర్వాత ఒక యువతి తన చున్నీ తీసి వేసే సీన్ పలు వర్గాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమైంది. కొంతమంది దీనిని మహిళా స్వేచ్ఛకు చిహ్నంగా చూస్తే, మరికొందరు అవసరం లేని సన్నివేశమని విమర్శించారు. ట్రోల్స్ కూడా పెరుగుతుండడంతో నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) స్వయంగా స్పందించారు. ఆయన స్పష్టంగా మాట్లాడుతూ..
Also Read : Kajol : 26 ఏళ్ల తర్వాత.. మ్యరెజ్ లైఫ్ కి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి అంటున్న.. కాజోల్
“ఈ సినిమా ద్వారా మేము చెప్పాలనుకున్నది భయాన్ని పోగొట్టమని, చున్నీలు తీసేయమని కాదు.ఆ సీన్ ఉద్దేశం మహిళలు తమలోని భయాన్ని తొలగించుకోవడం గురించి కానీ దయచేసి దాన్ని వేరే కోణంలో చూడడం సరైంది కాదు.” అని వివరణ ఇచ్చారు. దీంతో ఆ కాంట్రవర్సీకి తాత్కాలికంగా పూర్తి క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఎస్.కె.ఎన్ ఇచ్చిన ఈ కౌంటర్‌తో చర్చలు కాస్త చల్లబడుతున్నాయి. మరోవైపు, రష్మిక అద్భుత నటన, కథలోని బోల్డ్ మెసేజ్ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది.
