NTV Telugu Site icon

SKN: ఇంకో అరగంట కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేది…అందుకే ప్రసాద్ ఐమాక్స్‌లో నేలను మొక్కా!

Skn At Baby Movie

Skn At Baby Movie

SKN Comments on Baby Movie Length: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ మూవీ సూపర్ హిట్ టాక్ తెచుకున్న క్రమంలో సినిమా టీం థాంక్స్ మీట్‌ నిర్వహించింది. ఈ థాంక్స్ మీట్‌లో నిర్మాత ఎస్కేఎన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మీడియాకు థాంక్స్, మీడియాలో నా స్నేహితులకు నచ్చితే చాలని అనుకున్నా కానీ అందరూ అద్భుతంగా ఉందని, మంచి సినిమా తీశావన్నారు. బేబీ సినిమా చూసి ప్రేక్షకులు ఏడుస్తూ బయటకు వచ్చారు, బయ్యర్లంతా నవ్వుతూ వచ్చారు అంటే నా సినిమా సక్సెస్ అయిందని అర్థమైంది. ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రీమియర్ పడ్డాక సినిమా సక్సెస్ అయిందని తెలిసి నేను దాన్ని టెంపుల్‌లా భావించి నేలను మొక్కానని అన్నారు. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశామన్న ఆయన నిడివి ఎక్కువగా ఉందని అనుకున్నామని అన్నారు. మంచి సినిమా తీశామని తెలుసు అందుకే ఆడియెన్స్ ఇందులో లెంగ్త్‌ను చూడలేదు, స్ట్రెంత్‌ను చూశారని అన్నారు. అయితే ఈ సినిమా ఇంకో అరగంట కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యేదన్న ఆయన పాత్రల భావోద్వేగాలు అర్థం కావాలని, అర్థం అయ్యేలా చెప్పాలనే సాయి రాజేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడని అన్నారు.

Jaanavule Lyrical Video: తమన్ ‘జాణవులే’ అంటుంటే బాగుంది ‘బ్రో’!

బేబీ నిర్మాతగా నేను గర్వపడుతున్నానని, ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన నా స్నేహితుడు సాయి రాజేష్‌కు థాంక్స్ అని అన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్‌ని రారా పోరా అని కూడా పిలవలేకపోతోన్నానని ఆయన మీద నాకు గౌరవం పెరిగిందని అన్నారు. మనల్ని నమ్మి ఆనంద్, వైష్ణవి, విరాజ్‌లు ఈ సినిమాకు కమిట్ అయ్యారు, మరో చిత్రాన్ని చేయకుండా ఉండిపోయారని అన్నారు. వైష్ణవిని అందరూ తిడుతున్నారు అంటే ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం అవుతుందన్న ఆయన విజయ్ బుల్గానిన్ అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తని ఈ సినిమాకు ఎంతో పెట్టారని అన్నారు. విజువల్స్ అంత బాగున్నాయ్ అని అంటున్నారు అది బాల్ రెడ్డి గారి కెమెరా గొప్పతనం అని ఈ సినిమాకు టీం అంతా కష్టపడి పని చేసిందని అన్నారు. సాయి రాజేష్‌ది, నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా? అని వెంటనే సినిమాను చేయమని పేర్కొన్న ఆయన మంచి కథ సెట్ అయినప్పుడే తీస్తామని అన్నారు. ప్రస్తుతం బేబీ సక్సెస్ మూడ్‌లో ఉన్నామని, మూడేళ్లు కష్టపడి సినిమా చేశాం, లాస్ట్ పదిహేను రోజులు నిద్రాహారాలు మానేసి పని చేశామని అన్నారు. నిన్న రాత్రి సంతృప్తిగా భోజనం చేసి పడుకున్నామని పేర్కొన్న ఆయన మెజార్టీ ఆడియెన్స్‌కు సినిమా నచ్చితే సక్సెస్ అవుతుందని అన్నారు. అలా మా బేబీ సినిమా సక్సెస్ అయింది. మా ఈ విజయం అందరిది, ఏ ఒక్కరిదో కాదని అన్నారు.