NTV Telugu Site icon

Skanda: కల్ట్ సాంగ్ కూడా సరిపోవట్లేదు… ఉన్న బజ్ కూడా పోయేలా ఉంది

Skanda

Skanda

ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా స్కంద. సెప్టెంబర్ 18 నుంచి 28కి వాయిదా పడిన ఈ మూవీ ప్రమోషన్స్ లో జోష్ కనిపించట్లేదు. గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేసి స్కంద సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసారు కానీ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం రిలీజ్ డేట్ కి చాలా రోజుల ముందే రిలీజ్ చేయడంతో మేకర్స్ దగ్గర నుంచి కొత్త కంటెంట్ బయటకి రావట్లేదు. లేటెస్ట్ గా స్కంద సినిమా నుంచి ఐటమ్ నంబర్ లిరికల్ వీడియో బయటకి వచ్చింది. రామ్ పోతినేని, ఊర్వశీ రౌతేలా మధ్య వచ్చిన ఈ సాంగ్ ని థమన్ మాస్ బీట్స్ తో నింపేయగా… అనంతశ్రీరామ్ కల్ట్ లిరిక్స్ రాసాడు. హేమచంద్ర, రమ్య బెహ్రా వోకల్స్ కల్ట్ మామా సాంగ్ ని పర్ఫెక్ట్ ఐటమ్ సాంగ్ గా మార్చాయి. సాంగ్ బాగుంది కానీ స్కంద సినిమా ఓపెనింగ్స్ ని అవసరమైన బజ్ ని క్రియేట్ చేయడంలో మాత్రం సౌండ్ సరిపోవట్లేదు.

మరి ఇక్కడి నుంచి అయినా స్పీడ్ పెంచి, ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే స్కంద సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి లేదంటే వీక్ ఓపెనింగ్స్ తప్పదు. నిజానికి రిలీజ్ డేట్ ని ఒకటికి రెండు మూడు సార్లు మార్చడమే స్కంద కష్టాలకి కారణం అయ్యింది. ముందుగా స్కంద సినిమాని దసరా బరిలో నిలబెట్టాలి అనుకున్నారు. ఆ సమయంలో బాలయ్య, రవితేజ, దళపతి విజయ్ సినిమాలు ఉండడంతో అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 18కి ప్రీపోన్ అయ్యింది. మేకర్స్ ఈ డేట్ కి తగ్గట్లు స్కంద సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసుకోని ఆల్మోస్ట్ సాలిడ్ హైప్ తెస్తున్నారు అనుకునే సమయానికి సలార్ వాయిదా పడడంతో ఆ రిలీజ్ డేట్ కోసం స్కంద సినిమాని మళ్లీ సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఇలా వాయిదాలు పడడం మరి స్కంద సినిమాకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.

 

Show comments