8 రోజుల డబ్బింగ్ 5 రోజుల్లో పూర్తి చేసిన ఎస్. జె. సూర్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శింబు తాజా చిత్రం ‘మానాడు’. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. ఈ పొలిటికల్ డ్రామాను తెలుగులో ‘ది లూప్’ పేరుతో డబ్ చేస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ ను విలన్ పాత్రధారి ఎస్.జె. సూర్య పూర్తి చేశాడు. ఎనిమిది రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేయాలని అనుకున్నామని, కానీ ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేశానని ఎస్.జె. సూర్య తెలిపాడు. ఎనిమిది రోజుల పనిని ఐదు రోజులలో చేయడంతో ఒళ్ళు హోనం అయిపోయింది. నాడి, నరాలు, మెడ, వెన్నుపూస, గొంతు… అన్నీ పోయాయి. కనీసం పదిరోజులైనా విశ్రాంతి తీసుకోవాల్సిందే’ అని ఎస్.జె. సూర్య ట్వీట్ చేశాడు. అయితే, డబ్బింగ్ అయిన తర్వాత చూస్తే అవుట్ పుట్ ఎంతో సంతృప్తికరంగా అనిపించిందని, నవంబర్ 25న తాము విజయం సాధించబోతున్నామని ఎస్. జె. సూర్య తెలిపాడు.
నిజానికి ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా ఉండటంతో శింబు చిత్ర నిర్మాతలు 25వ తేదీకి విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలో భారతీరాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్, కరుణాకరన్, ప్రేమ్ జీ అమరన్ ఇతర సహాయ పాత్రలను పోషించారు.
Also Read
తాజావార్తలు
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!