Sivangive in Zee Telugu as womens day Special: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది జీ తెలుగు. మహిళల స్ఫూర్తిని, విజయాలను గౌరవించడానికి సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం‘శివంగివే’ వేదికపై ఘనంగా సత్కరించింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శివంగివే ఆదివారం (మార్చి 10) సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నారు. అన్ని రంగాలకు చెందిన మహిళల అమూల్యమైన కృషి, విశేష విజయాలను స్మరించుకోవడానికి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం. మహిళల ధైర్యసాహసాలు, విజయాలను గౌరవిస్తూ సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం మరిచిపోలేని అనుభూతులు, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకుల హృదయాలను తాకే ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకుంటుందని ఒక ప్రకటన రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల, హాస్య నటి కోవై సరళ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జీ తెలుగు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిహారిక, కోవై సరళ తనదైన రీతిలో కామెడీ చేసి నవ్వించడమే కాకుండా హృదయాలను తాకే స్కిట్స్‌తో ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తారు.
Akash Puri: క్లాతింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరో ఆకాష్ పూరి
వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వరుస ప్రదర్శనలు వీక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. స్ఫూర్తిదాయకమైన జుల్కర్ నృత్యప్రదర్శనతో మొదలై హారికా నారాయణ్, రమ్య బెహరా, వాగ్దేవి శ్రావ్యమైన గానం వరకు శివంగివే కార్యక్రమం ప్రతి హృదయాన్ని ఆనందం, సంతోషభరిత క్షణాలతో నింపుతుంది. ఈకార్యక్రమంలో స్వర్గీయ నటుడుకృష్ణంరాజుసతీమణిశ్యామలాదేవితోపాటుప్రముఖడబ్బింగ్ఆర్టిస్టులుకృష్ణవేణి, గాయత్రితదితరులుప్రత్యేకఆకర్షణగానిలవనున్నారు. ఈ వేదికపై దివంగత నటుడు తారకరత్న సినీ ప్రయాణాన్ని ప్రదర్శించి ఆయనకు ఘన నివాళి అందించారు. ఉద్వేగభరితంగా సాగిన ఈ కార్యక్రమంలోతారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, కూతురు నిషా ఆయనను గుర్తు చేసుకుంటూ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తారు. హృదయానికి హత్తుకునే క్షణాలు తారకరత్నజీవితాన్ని కళ్లముందు కదిలేలా చేస్తాయి. ప్రముఖఉర్దూ కవయిత్రి, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారిణి జమీలా నిషాత్ జీవితం ఆధారంగా రూపొందిన నాటకంలో ఆషిక పదుకొణె నటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం ‘శివంగివే’ ప్రేక్షకులహృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది.
