Sivakarthikeyan compensates for Prince loss: సినిమాలకు సంబంధించిన బిజినెస్ (లావాదేవీలు) వ్యవహారాలతో హీరోలకు ఏమాత్రం సంబంధం ఉండదు. అవన్నీ నిర్మాతలే చూసుకుంటారు. లాభాలొచ్చినా ఎలాగైతే కోటానుకోట్లను తమ ఖాతాలోకి వేసుకుంటారో, నష్టపోయినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు డీలింగ్స్ కుదుర్చుకుంటుంటారు. కాబట్టి.. ఈ బిజినెస్‌లో హీరోలు జోక్యం చేసుకోరు. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకొని, తమ పని కానిచ్చేసుకొని సైడ్ అయిపోతారు. అయితే.. కొందరు హీరోలు మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతే, తాము తీసుకున్న పారితోషికాన్ని తిరిగి వెనక్కు ఇచ్చేస్తారు. మరికొందరైతే నేరుగా డిస్ట్రిబ్యూటర్లు ఆదుకోవడానికి ముందుకు వచ్చేస్తారు. ఇలాంటి సంఘటనల గురించి మనం గతంలోనూ విన్నాం.
Ghatkesar ENGG College: కాలేజీలో దారుణం.. అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి..
ఇప్పుడు శివకార్తికేయన్ ఆ హీరోల్లాగే ముందుకొచ్చాడు. తన ప్రిన్స్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆదుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివ ‘ప్రిన్స్’ అనే సినిమా చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఇది అక్టోబర్ 21వ తేదీన విడుదల అయ్యింది. అయితే.. ఆశించిన స్థాయిలో ఇది వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో.. అంచనాలు తారుమారై, రెండు చోట్లా ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. రిపోర్ట్స్ ప్రకారం.. ప్రిన్స్ సినిమా రూ.12 కోట్ల నష్టాలను మిగిల్చిందట! ఈ విషయం తెలుసుకున్న శివకార్తికేయన్.. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు. వారు నష్టపోయిన మొత్తంలో సగం డబ్బులు తిరిగి వెనక్కు ఇచ్చేశాడని తెలిసింది. అంటే.. దాదాపు ఆరు కోట్ల మేర (రూ.3 కోట్లు నిర్మాతలకు, రూ.3 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు) వారికి తిరిగి ఇచ్చాడట! దీంతో.. శివకార్తికేయన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
