NTV Telugu Site icon

Sivakarthikeyan :’మహావీరుడు’గా శివకార్తికేయన్

Mahaveerudu

Mahaveerudu

ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రకటన వీడియోను ఈరోజు విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాకు తమిళంలో ‘మావీరన్’ అని, తెలుగులో ‘మహావీరుడు’ అనే పేరు పెట్టినట్లు తెలియచేశారు. ప్రస్తుతం ‘ప్రిన్స్, అయలాన్’ సినిమాలు సెట్స్ మీద ఉండగానే ‘మహావీరుడు’ ప్రకటన చేయటం విశేషం. తెలుగులో ఈ టైటిల్ వీడియోను మహేశ్ బాబు విడుదల చేస్తూ యూనిట్ కి విజయం దక్కాలని ఆకాంక్షించారు. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.