NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: ఇది నిజంగా ఉల్టా ఫుల్టానే.. శివాజీకి మూడోస్థానం.. ఫైనలిస్టులుగా ప్రశాంత్, అమర్.?

Sivaji

Sivaji

Sivaji Likely To Be Eliminated At Third Position Bigg Boss 7 Telugu Grand Finale: బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కూడా ఉల్టా పుల్టా గానే సాగుతుంది. శనివారం ఉదయం నుంచే గ్రాండ్ ఫినాలే షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కాగా ఆరవ స్థానంలో అర్జున్ అంబటి, 5వ స్థానంలో ప్రియాంక, 4వ స్థానంలో యావర్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 3వ స్థానంలో విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాప్ 3 కంటెస్టెంట్స్ నుంచి మరో కంటెస్టెంట్ అవుట్ అయ్యారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, హీరో కమ్ కంటెస్టెంట్ శివాజీ. శివాజీ ముందు నుంచి టైటిల్ రేసులో ఉన్నాడు. దీంతో ఆయన విన్నర్ అవుతాడు అనుకుంటే, ఇలా ఇప్పుడు సీజన్ లో టాప్ 3 స్థానం కైవసం చేసుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Adivi Sesh: నాకు డబ్బు పిచ్చి లేదు.. అందుకే చాలా పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేశా: అడివి శేష్

ముందు నుంచి పల్లవి ప్రశాంత్ లేదంటే… శివాజీ ఇద్దరిలో ఒకరు విన్నర్ కానున్నారని ప్రచారం సాగింది, కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తో పాటు అమర్ దీప్ కూడా టైటిల్ రేసులో నిలబడ్డాడు. ఇక నిజానికి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా సీజన్ కావడంతో.. శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ సీజన్ లో శివాజీ మైండ్ గేమ్, కన్నింగ్ గేమ్ ఆడుతూ వచ్చాడని ప్రశాంత్, యావర్ వంటి వారికి కోచింగ్ ఇస్తూ. ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడని విశ్లేషణలు ఎన్నో వచ్చాయి. అయినా సరే ఆయనకు విన్నింగ్ అవకాశాలు ఉన్నాయి అనుకున్నారు కానీ కానీ శివాజీ ఎలిమినేషన్ ప్రేక్షకులకు, అభిమానులకు షాకింగ్ అని అనిపిస్తుంది. ఇక విన్నర్ అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరో ఒకరు కానున్నారు, ఆ షూట్ రేపు సాయంత్రం జరగనుంది అని తెలుస్తోంది.

Show comments