NTV Telugu Site icon

Sivabalaji : బెట్టింగ్ యాప్స్ కోసం రూ.3 కోట్లు ఇస్తామన్నారు : శివబాలాజీ

Sivabalaji

Sivabalaji

Sivabalaji : ఇప్పుడు దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ భూతానికి వేలాది మంది అమాయకులు బలైపోయారు. ఆ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. విచారణకు కూడా వెళ్తున్నారు. కొందరు తమకు తెలియక చేశామని క్షమించమని కోరుతున్నారు. ఇంకొందరేమో లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సర్ది చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆఫర్లు వచ్చాయన్నారు నటుడు శివబాలాజీ, ఆయన భార్య మధుమిత. అలాంటి యాప్స్ ను ప్రమోట్ చేయమని అడిగితే తాము అస్సలు చేయలేదన్నారు.

Read Also : Duddilla Sridhar Babu : ‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

‘సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని మమ్మల్ని కూడా చాలా మంది అడిగారు. రూ.3 కోట్లు ఇస్తామన్నారు. కానీ మేం చేయలేదు. ఎందుకంటే వాటి వల్ల చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి. ఆ రోజు మేం చేయకుండా ఉండటమే మంచిదైంది. వాటిని ప్రమోట్ చేసిన చాలా మంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ గురించి ఒక వీడియో చేయండి అంతా మేం చూసుకుంటాం అని అంటారు. కానీ వాటి జోలికి వెళ్లకుండా ఇప్పటికీ షూటింగులతోనే సంపాదిస్తున్నాం’ అని తెలిపారు ఈ ఇద్దరూ. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శివబాలాజీ ప్రస్తుతం రెండు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు.