NTV Telugu Site icon

Sitara : సినిమాల్లోకి సితార ఎంట్రీ.. అన్ని చోట్లా కుళ్ళు ఉందంటూ నమ్రత కామెంట్స్

Sithara Movie Debut

Sithara Movie Debut

Sitara on entering movie industry: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార ఈ మధ్యకాలంలో ఒక జ్యువెలరీ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో నగలు ధరించిన ఆమె ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ మీద కూడా ప్రిన్సెస్ సితార లిమిటెడ్ జువెలరీ ఎడిషన్ పేరుతో సితార ఫోటోలను కూడా ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది. అయితే సితార అడ్వర్టైజింగ్ వ్యవహారం మీద మాట్లాడేందుకు నమ్రతా శిరోద్కర్ తో కలిసి సితార మీడియా ముందుకు వచ్చింది. అలా వచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు నమ్రత సమక్షంలోనే సితారకు సినీ పరిశ్రమలో రాణించాలని కోరిక ఉందా అని ప్రశ్నిస్తే దానికి సితార ఎక్సైట్ అవుతూ తనకు సినీ పరిశ్రమలోకి రావాలనే ఉద్దేశం ఉందని కామెంట్ చేసింది.

Namratha Shirodkar :ఐదు పదుల వయసులో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో నమ్రత..

ఇక అదే సమయంలో ఈ విషయం మీద మీ ఉద్దేశం ఏమిటి అనే నమ్రతని అడిగితే తమ కుమారుడు కానీ కుమార్తె కానీ ఏ రంగంలోకి వెళ్లాలి అనుకున్నా తాము వారిని ప్రోత్సహిస్తామని, వారి ఒపీనియన్ కి వ్యాల్యూ ఇచ్చి వారు ఏం చేయాలి అనుకున్న తప్పకుండా వారి వెంట ఉంటామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. నిజానికి ఆర్గానిక్ గా వాళ్ళకి ఏం చేయాలి అనిపిస్తే అది చేయనివ్వాలి తప్ప మన ఉద్దేశాలు వారి మీద రుద్దకూడదు అని ఆమె కామెంట్ చేసింది. ఇక సినీ పరిశ్రమ మీద బయట చాలా తప్పుడు అభిప్రాయం ఉందని మీ లాంటివారు సినీ పరిశ్రమలోకి మీ సంతానాన్ని పంపడం ద్వారా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు కదా బాగుంది అని అంటే నిజానికి అన్ని రంగాల్లోనూ తప్పుడు విషయాలు ఉన్నాయి, అని అర్థం వచ్చేలా నమ్రత కామెంట్ చేశారు. ఇక వాటికి దూరంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అని అర్ధం వచ్చేలా ఆమె కామెంట్లు చేశారు.

Show comments