NTV Telugu Site icon

Guntur Kaaram: తండ్రికి తగ్గ తనయ.. అనాధ పిల్లల కోసం సితార కీలక నిర్ణయం

Sithara Movie Debut

Sithara Movie Debut

Sitara Ghattamaneni will host a special screening of Guntur Kaaram for orphanage kids: ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు మహేష్ బాబు. గతంలో ఆయన చేస్తున్న సినిమాల్లోనే సహ నిర్మాతగా ఉండేవాడు కానీ తర్వాత సొంతంగా ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంగతి అలా ఉంచితే ఒక పక్క హీరోగా వ్యవహరిస్తూనే మరొక పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అంతేకాక ఇంత ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత వెనక్కిచ్చేయాలని భావించి ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి పేదలైన చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు. అంతేకాక తెలిసి తెలియక ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన కుమార్తె సితార ఘట్టమనేని కూడా తన తండ్రి బాటలోనే నడిచేందుకు ముందుకొచ్చింది. వాస్తవానికి ఆమె గతంలోనే ఒక జ్యువెలరీ యాడ్ కి సంబంధించి వచ్చిన రెమ్యూనరేషన్ అంతా చారిటీ వర్క్ కోసం ఖర్చు పెట్టగా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.

Chiranjeevi: ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్నార్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్.. అప్పటి రహస్యాలు బయటపెట్టిన చిరంజీవి

మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. అయితే సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందని అంటున్నారు. అయితే సితార ఇప్పుడు ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అనాధ పిల్లల కోసం గుంటూరు కారం స్పెషల్ స్క్రీనింగ్ వేయించాలని ఆమె నిర్ణయం తీసుకుంది. తన తండ్రికి చెందిన ఏఎంబి థియేటర్ లోనే స్పెషల్ షో వేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం లేదా పొద్దుపోయిన తర్వాత ఈ షో ఉండే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం సమంత కూడా అనాధ పిల్లలను తీసుకుని ఒక స్పెషల్ స్క్రీనింగ్ కి వచ్చింది. హాయ్ నాన్న సినిమాని అనాధ పిల్లలకు చూపించింది. ఇప్పుడు అదే బాటలో సితార నడవడం ఆసక్తికరం.

Show comments