సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ లాంటి వాడు. ఎంత హృదయాల్ని ఆగిపోకుండా చూసాడో? ఎంత మంది చదువులు పూర్తయ్యేలా చేసాడో అనే లెక్కలు కూడా తెలియకుండా మహేష్ చేసే సాయం ప్రతి ఒక్కరికీ ఒక ఇన్స్పిరేషన్ లాంటిదే. కుడి చేత్తో చేసిన సాయం, ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా ఆ మాటని తూచా తప్పకుండా పట్టించే మహేష్ బాబు బాటలోనే కూతురు సితారా ఘట్టమనేని కూడా నడుస్తోంది. చిన్న వయసులోనే బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తున్న సితార ఘట్టమనేని, తన మొదటి పేమెంట్ ని చారిటీకి ఇచ్చేసింది. లేటెస్ట్ గా సితారా తన బర్త్ డే రోజున కొంతమంది ఆడపిల్లలకి సైకిళ్లని పంచింది. కూతురు చేసిన పనిని మెచ్చుకుంటూ నమ్రతా ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేస్తూ… “Little girls happy with their new ride 🚴 Now school is just a bicycle away!! Love you our little one for your thoughtfulness and a large heart filled with love ❤️ May you make many more such meaningful memories along your glorious journey!! Happy birthday” అని కోట్ చేసింది. 11వ ఏట అడుగు పెట్టిన సితారాని చూసి… తండ్రికి తగ్గ కూతురు అంటూ ఘట్టమనేని అభిమానులు సితారకి బర్త్ డే విషెష్ చెప్తున్నారు.
Read Also: Malvika Sharma Hot Pics: ఎయిర్‌పోర్ట్‌లో మాళవిక శర్మ రచ్చ.. కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యే లుక్స్!
Happy 11th, my star!! 🌟 Achieve everything you set your mind to ❤️❤️❤️ #SitaraGhattamaneni pic.twitter.com/ZFPdizISia
— Mahesh Babu (@urstrulyMahesh) July 20, 2023
