Site icon NTV Telugu

Sir/Vaathi: ధనుష్ సినిమా కోసం 7 స్క్రీన్ తో కలిసిన సితార…

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ‘ధనుష్’ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’. ‘సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2023 ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ చేస్తున్న సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘సార్’ తమిళ థియేటర్ రైట్స్ విషయంలో ‘7 స్క్రీన్ స్టూడియోస్’తో కొలాబోరేట్ అయ్యారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ ట్వీట్ చేశారు. ‘సార్’ సినిమా తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ అవుతోంది.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ అవుతున్న సమయంలో, స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పడానికి లెక్చరర్స్ ఎక్కువగా ఉండే వారు కాదు. దీంతో గవర్నమెంట్ కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్స్ ని ప్రైవేట్ కాలేజీలు గెస్ట్ లెక్చరర్స్ గా పని చేయించుకునేవి. 90ల నుంచి 2000ల కాలంలో విజయవాడ ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువగా జరిగేవి. దీనిని వ్యతిరేకించిన ఒక గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ కథగా ‘సార్’ సినిమా రూపొందుతోంది.

Exit mobile version