Site icon NTV Telugu

Sitara: ఇది కదా పెంపకం అంటే.. తండ్రి బాటలోనే కోటి దానమిచ్చిన సితార?

Sitara Chairty

Sitara Chairty

Sitara Donated her first remuneration of one crore to charity: మహేష్ బాబు, నమ్రత దంపతుల కుమార్తె సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందాన చిన్ననాటి నుంచి డాన్సులు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఆమె చేసిన పని ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటుంది. అసలు విషయం ఏమిటంటే సితార తన జీవితంలోనే మొట్టమొదటి యాడ్లో కనిపించింది. పీఎంజే జ్యువెలర్స్ అనే సంస్థ సితార ఘట్టమనేనితో కలిసి ప్రిన్సెస్ సితార లిమిటెడ్ ఎడిషన్ అనే కొన్ని నగలు సిద్ధం చేసి అమ్మకానికి పెట్టింది. ఇక ఇలా సితార ఈ యాడ్లో కనిపించినందుకు గాను దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇదే యాడ్ కు సంబంధించి నమ్రతతో కలిసి సితార హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చింది.

Sitara : సినిమాల్లోకి సితార ఎంట్రీ.. అన్ని చోట్లా కుళ్ళు ఉందంటూ నమ్రత కామెంట్స్

ఇక మీడియాతో ఇంటరాక్షన్ చేస్తున్న సమయంలో ఈ మొదటి యాడ్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారా? లేక మీ తండ్రి మహేష్ కి ఇచ్చారా? తల్లి నమ్రతకు ఇచ్చారా? అని అడిగితే సితార ఆసక్తికరంగా తాను చారిటీకి ఇచ్చానని కామెంట్ చేసింది. నిజానికి మహేష్ బాబు కూడా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ సర్వీస్ చేస్తున్నారు. తాను బిజీగా ఉన్నా సరే నమ్రత ఆ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిపి ఇప్పటివరకు దాదాపు 1,000 మంది చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్లు చేయించారు. ఇప్పుడు మహేష్ బాటలోనే సితార కూడా తనకు కోటి రూపాయలు వస్తే వాటిని ఏవో కొనుక్కోవాలని ఆశపడకుండా చారిటీకి ఇవ్వడం గర్వించవలిసిన విషయం అని మహేష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సరైన పెంపకం పెంచితే ఇలానే మంచి బుద్ధులు అలవడతాయి అంటూ వారంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version