NTV Telugu Site icon

Sita Ramam: ఈ ప్రేమకావ్యం చరిత్రలో నిలిచిపోతుంది…

Sita Ramam

Sita Ramam

వైజయంతి మూవీస్ అనే బ్యానర్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అన్నగారు ఎన్టీఆర్ నామకరణం చేసిన ఈ బ్యానర్ ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. అశ్వినీ దత్ లాంటి ప్రొడ్యూసర్ ని ఇండస్ట్రీకి గిఫ్ట్ గా ఇచ్చింది. కంటెంట్ ఉన్న కథలపై కోట్లు కర్చు పెట్టి, గ్రాండ్ స్కేల్ లో సినిమాలు చెయ్యడం వైజయంతి మూవీస్ ఆనవాయితీగా చేస్తున్న పని. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో బౌన్సు బ్యాక్ అయిన ఈ బ్యానర్, నేషనల్ అవార్డ్ అందుకుంది. కొన్ని సినిమాలు డబ్బులు ఇస్తాయి, కొన్ని సినిమాలు అవార్డులు ఇస్తాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకి మాత్రం డబ్బులు, అవార్డులు రెండూ వస్తాయి, మహానటి సినిమానే ఇందుకు అతిపెద్ద ఉదాహరణ. లేటెస్ట్ గా లిస్టులో చేరిన సినిమా ‘సీతారామం’, దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాని హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు.

2022 ఆగస్ట్ నెలలో రిలీజ్ అయిన సీతారామం సినిమా ఒక దృశ్యకావ్యంగా పేరు తెచ్చుకుంది. మోడరన్ క్లాసిక్ లవ్ స్టొరీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో, రిలీజ్ అవుతున్న సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కూడా కష్టాలు పడుతున్న తరుణంలో మంచి సినిమాని రిలీజ్ చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అనే నమ్మకం కలిగించింది సీతారామం సినిమా. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిన సీతారామం సినిమా బయ్యర్స్ అందరికీ హ్యూజ్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది. ముందు చెప్పినట్లు వైజయంతి మూవీస్ నుంచి వచ్చే సినిమాకి డబ్బులు మాత్రమే కాదు అవార్డులు కూడా వస్తాయి అన్నట్లుగానే, సీతారామం సినిమాకి బెస్ట్ ఫిల్మ్ గా ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డ్ లభించింది. 13వ దాదా సహేడ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవంలో సీతారామం సినిమాకి బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ రావడంతో మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ అవార్డ్ రాకతో సీతారామం సినిమా విలువ మరింత పెరిగిందనే చెప్పాలి.

Show comments