NTV Telugu Site icon

బ్రేకింగ్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి పరిస్థితి విషమం

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24 అస్వస్థతతో కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయనను నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Also Read : ఒమిక్రాన్‌ వేళ.. మరోసారి కోవిడ్‌ నిబంధనలు పొడగించిన కేంద్రం