Site icon NTV Telugu

Singer Susheela: ఘనంగా ప్రముఖ గాయని సుశీల మనవరాలి నిశ్చితార్థం..

singer susheela

singer susheela

ప్రముఖ గాయని పి సుశీల మనవరాలి నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి శంషాబాద్ లోని సియారా రీట్రీట్ లో ఘనంగా ననిర్వహించారు. సుశీల, మోహన్ రావులకు జయకృష్ణ ఒక్కడే కొడుకు. ఆయన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలోని నివాసముంటున్నారు. జయకృష్ణ , సంధ్య దంపతుల కుమార్తె అయిన శుభశ్రీకి బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్, రాధిక దంపతుల కుమారుడు వినీత్‌తో వివాహం నిశ్చయమైంది. మంగళవారం ఈ జంట నిశ్చితార్ధ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version