NTV Telugu Site icon

Sunitha: నా రెండో పెళ్లి గురించి మీకెందుకు.. సంస్కారం ఉంటే మాట్లాడరు

Sunitha

Sunitha

Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన వాయిస్ తో ఎంతోమంది సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసేస్తుంది.  ఇక ఆమె ఆహార్యం, నవ్వు తెలుగింటి ఆడపడుచు అంటే ఇలానే ఉండాలి అని అనిపించేలా ఉంటుంది. ఆమె అంటే అందరికి అభిమానమే. అయితే సునీత రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలామంది ఆమెను వ్యతిరేకించారు. ఈ వయస్సులో నీకు పెళ్లి అవసరమా..? అంటూ ట్రోల్స్, మీమ్స్ వేసి విమర్శించారు. వాటిని పట్టించుకోకుండా సునీత గత ఏడాది రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకొంది. ఇప్పటికి ఆమెపై ట్రోల్స్ మాత్రం తగ్గలేదు. డబ్బు కోసం చేసుకుందని, సుఖం కోసం చేసుకుందని నానా మాటలు అంటూనే ఉన్నారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ ట్రోల్స్ పై స్పందించింది.

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి.. మీ రెండో పెళ్లి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటి గురించి మీరేమంటారు అని అడుగగా.. ఆమె ఎమోషనల్ అవుతూ “మీరందరూ అంటూ ఉంటారు కదా.. చిత్ర గారి తరువాత 121 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది అని, చాలామందికి ఎంటర్ టైన్మెంట్ కు కారణం నేను కారణమని అంటూ ఉంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితంపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి గొంతు లేపుతున్నారు. సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. ఒక మనిషిని ఒక మాట అనేముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. వాళ్ళేం మాట్లాడుతున్నారో..” అంటూ కంటనీరు పెట్టుకుంది.  ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.