టాలీవుడ్ లో సింగర్ సునీతకు ప్రత్యేకమైన పరిచయం అక్కడ్ర్లేదు. ఆమె వాయిస్ కి ఫిదా కానీ సంగీత అబిమాని లేడు అని అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
“ఈ ఏడాది ఎన్నో సంఘటనలు చూసాను.. కానీ నాకేమి అనిపించలేదు. ఎందుకంటే బాల సుబ్రహ్మణ్యం గారు మృతి చెందినప్పుడే నా కన్నీళ్లు ఆగిపోయాయి. ఆ తరువాత కన్నీళ్లు తెప్పించే ఏ విషయమైనా కన్నీళ్లు మాత్రం రావడం లేదు. ఏదైనా సంఘటన విన్న వెంటనే కొద్దిసేపు బ్లాంక్ అయిపోతాను.. అంతేకాని ఏడుపు రావడం లేదు. ఆ బాలు గారి మరణాన్ని ఇప్పటికి తట్టుకోలేకపోతున్నాను” అని ఎమోషనల్ అయ్యారు. ఇక తన వైవాహిక బంధం బాగుందని, ఆయన బిజినెస్ విషయంలో తాను తలదూర్చనని.. ఏదైనా సలహా అడిగితె చెప్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో మంచి పాటలను పాడుతున్నాని తెలిపారు.
