NTV Telugu Site icon

Singer Sunitha: సింగర్ సునీత ప్రెగ్నెంట్.. ఎవరు చెప్పార్రా మీకు

Sunitha

Sunitha

Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చిన్నప్పుడే ఏమైనా తేనెపట్టును మింగిందా అన్నట్టు.. ఆమె పాడుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుంది.ఆమె పాడిన సాంగ్స్ అన్ని క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఒక్క గాత్రం తోనే కాదు అందంతో కూడా సునీత ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది, నిండైన చీరకట్టుతో తెలుగు ఇంటి ఆడపడుచు ఇలానే ఉంటుంది అని ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంటుంది. ఇక సునీత రెండేళ్ల క్రితం రామ్ వీరపనేని అనే బిజినెస్ మ్యాన్ ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక పెళ్లి అయిన దగ్గరనుంచి.. సునీత ఏ పోస్ట్ పెట్టినా.. ఆమె ప్రెగ్నెంటా అంటూ కామెంట్స్ పెట్టడం.. వాటిని ఆమె ఖండిస్తూ ఉండడం జరుగుతూనే వస్తున్నాయి.

Indian Idol Season 2: ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్2 ఆరంభం

మొన్నటికి మొన్న తోటలో మామిడి కాయలు పట్టుకొని ఫొటోస్ పోస్ట్ చేస్తే.. సునీత ప్రెగ్నెంట్.. అందుకే మామిడి కాయలు చూపిస్తూ హింట్ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ప్రతిసారి ఆమె ప్రెగ్నెంట్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. ఈ మధ్య కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్నా.. మరోసారి సునీత ప్రెగ్నెంట్ వార్తలు ట్రెండింగ్ గా మారింది. దీంతో ఈసారి కూడా సునీత స్పందించక తప్పలేదు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” నేను ప్రెగ్నెంటా..? ఆ విషయం నాకే తెలియదు. ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్న వారిని.. వారి ఆలోచన విధానానికే వదిలేస్తున్నా.. నా జీవితాన్ని వారు ఏం చేయలేరు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలతో సునీత మరోసారి పుకార్లకు చెక్ పెట్టింది. ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు సైతం ఈ రూమర్స్ పుట్టించేవారికి.. ఎవరు చెప్తున్నార్రా మీకు ఇలాంటి వార్తలు అంటూ ఏకిపడేస్తున్నారు.

Show comments