టాలీవుడ్ సింగర్ సునీత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఇటీవల సునీత తన సోషల్ మీడియా లో ఒక ఫోటో పెట్టింది. తమ ఫార్మ్ హౌస్ లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ పోజు ఇచ్చిన సునీత క్యాప్షన్ గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో అది చూసినవారందరు ఆమె మరోసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు.
ఇక తాజాగా ఈ వార్తలపై సునీత స్పందించింది. ” దేవుడా.. జనాలు ఇంత క్రేజీగా ఉన్నారేంటి. మామిడి కాయలతో ఫోటో దిగి పోస్ట్ చేస్తే ఏదేదో ఊహించుకొని రాసేశారు. దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయకండి. మీకో దండం రా నాయనా’అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సునీత తల్లి కాబోతుంది అనే వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇకపోతే సునీత గత కొన్ని నెలల క్రితం బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం విదితమే.
