Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!” ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!

Sunitha

Sunitha

ఈ మధ్యకాలంలో సమాజంలో ఫెమినిజం, విమెన్ రైట్స్ పేరుతో జరుగుతున్న కొన్ని డిబేట్లపై సింగర్ సునీత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బట్టలు వేసుకోవడం, సిగరెట్లు తాగడం ఫెమినిజం కిందకు రాదని, అది కేవలం స్టూపిడిటీ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె “ఈ రోజుల్లో సిగరెట్ లైటర్‌ను ఫ్రీడమ్‌కు టార్చ్ బేరర్ లాగా చూస్తున్నారు. సిగరెట్ తాగడాన్ని ఈక్వాలిటీ అనుకోవడం ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖత్వం. మగవాడు సిగరెట్ తాగితే వాడి జీవితంలో కొన్ని నిమిషాలు తగ్గుతాయేమో, కానీ అదే సిగరెట్ ఒక ఆడపిల్ల తాగితే ఆవిడ లైఫ్ లో నుంచి 12 గంటల ఆయుష్షు వెళ్ళిపోతుంది. మగవాళ్లతో ఇలాంటి వాటిల్లో ఈక్వాలిటీ వెతుక్కోవడం ఏంటి? అలాగే బట్టల విషయంలో ‘మై బాడీ మై రైట్’ (నా శరీరం నా ఇష్టం) అని అమ్మాయిలు స్లోగన్స్ ఇస్తున్నారు. సరే.. నీ శరీరం నీ ఇష్టమైనప్పుడు, ‘హిస్ ఐస్ హిస్ రైట్’ (వాడి కళ్ళు వాడి ఇష్టం) కదా! వాడి చూపును నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? బిల్లియన్ల మంది మనుషుల చూపులను మార్చడం కంటే, మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం ఈజీ మెథడ్ కదా” అని సునీత అన్నారు.

నాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడమే ఫెమినిజం అంటే నాకు నవ్వొస్తుంది అని సునీత అన్నారు. “నిజమైన ఈక్వాలిటీ అంటే ఒక ఇంట్లో లేదా సమాజంలో ఒక ఆడది మైక్ పట్టుకుని ఒక అభిప్రాయం చెప్తే, దానికి మగవాడు ఎంతవరకు విలువ ఇస్తున్నాడు? ఆమె ఆలోచనా విధానాన్ని గౌరవిస్తున్నారా లేదా? అనే దానిపై పోరాడాలి. కానీ బట్టల పరిధి పెంచుకోవడాన్ని ఫ్రీడమ్ అనరు. ఆడవాళ్లు, మగవాళ్లు సమానం కాదు.. ఇద్దరి కంపోజిషన్ వేరు, నేచర్ వేరు. ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు” అని సునీత తేల్చి చెప్పారు.

×
×
Ad