Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్

Mangli

Mangli

ఒకపక్క వివాదాల నడుమ మంగ్లీ కొట్టుమిట్టాడుతో అంటే మరోపక్క ఆమె పాడిన కొత్త పాట రిలీజ్ అయింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అది అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఇక తాజాగా ‘అనకాపల్లి’ నుంచి జాతర సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో సంగీత స్టెప్పులు, గ్రాండియర్‌గా పాటను తెరకెక్కించిన తీరు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మంగ్లీ గాత్రం ఇలా అన్నీ హైలెట్‌గా నిలుస్తున్నాయి. నిజంగానే ఓ జాతర చూస్తున్నామా? అన్న రేంజ్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పాటకు గణేష్ సలాది లిరిక్స్, దేవజండ్ బాణీ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఇక మంగ్లీ పాడిన ఈ పాట ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.