ప్రముఖ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్ళింది అని వైద్యులు తెలిపారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చిన కల్పన నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదని స్టేట్మెంట్లో చెప్పింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే
ప్రస్తుతం పుర్తిగా కోలుకున్న సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ ‘ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త ప్రచారం జరుగుతుంది. నాకు సంవత్సరాలు. ఇప్పుడు నేను నా భర్త సపోర్ట్ తో పీహెచ్డీ చదువుతూ, ఎల్ ఎల్ బి చదువుకుంటున్నాను, అలాగే మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నాను. ఆ స్ట్రెస్ వలన వలన నాకు నిద్ర పట్టట్లేదు. డాక్టర్ సూచన మేరకు మెడిసిన్ తీసుకున్నాను. కానీ నాకు నిద్ర పట్టడం లేదని ఎక్కువ డోస్ తీసుకున్నాను. నా భర్త ప్రసాద్ ప్రభాకర్ సరైన సమయంలో పోలీసులకి సమాచారం ఇచ్చి నన్ను కాపాడాడు. నాకు ఇలాంటి ఫ్యామిలీస్ ఇష్యూస్ లేవు నేను హ్యాపీగా ఉన్నాను. త్వరలనే మళ్ళి పాటలు పడుతూ మీ ముందు వస్తాను, మీడియాకి పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు’. అని అన్నారు.