Aaron Carter: అమెరికన్ యంగ్ సింగర్ అనుమానాస్పద మరణం ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ యంగ్ సింగర్ ఆరోన్ కార్టర్ తన బాత్ రూమ్ టబ్ లో శవంగా కనిపించాడు. కాలిఫోర్నియాలో నివాసముంటున్న ఆరోన్.. 7 ఏళ్లకే సింగర్ గా మారాడు. అతని వాయిస్ కు అమెరికాలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో ఆల్బమ్స్ లో కూడా పాడి మెప్పించిన ఆరోన్ గతరాత్రి తన బాత్ టబ్ లో శవంగా కనిపించాడు.
ఆరోన్ సింగర్ గానే కాకుండా పలు సినిమాలో నటుడిగా కూడా మెప్పించాడు. అయితే అతని మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఆరోన్ కు ఎవరు శత్రువులు లేరని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇది హత్యా.. ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది. తమ ఫేవరేట్ సింగర్ మృతి వార్త విన్న అభిమానులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. 34 ఏళ్ళ వయస్సులోనే ఆరోన్ మృతిచెందడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని పలువురు ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమెరికన్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇక దుబాయ్ లో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇదే విధంగా బాత్ టబ్ లో శవమై తేలిన విషయం తెల్సిందే.
