Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..

Simran

Simran

దశాబ్దాల పాటు తన అందం, అభినయం, అద్భుతమైన డాన్స్‌తో దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని ఏలిన సీనియర్ నటి సిమ్రాన్. 1995లో ‘సనమ్ హర్జాయ్’ మూవీతో వెండితెరకు పరిచయమైన సిమ్రన్.. ‘కన్నత్తిల్ ముత్తమిట్టల్’,’వాలి’, ‘ప్రియమానవలే’,’పంచతంత్రం’ వంటి చిత్రాలు ఆమెను స్టార్‌ను చేశాయి. తాజాగా సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఆమె శశికుమార్ సరసన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ముందు నుండి కూడా సీనియర్ హీరోయిన్ లు చాలా మంది బాలీవుడ్ మీద అసహనం వ్యాక్తం చేస్తువస్తున్నప్పటికి తాజాగా సిమ్రాన్ కూడా వైరల్ కామెంట్స్ చేశారు..

సిమ్రాన్ మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో సగానికి పైగా సమయాన్ని సినిమాకే ఇచ్చాను. కానీ బాలీవుడ్‌లో మమ్మల్ని కొత్త నటుల్లా చూస్తారు. మాకున్న లెగసీని వారు అస్సలు గుర్తించరు. అందుకే నాకు అవకాశాలు వచ్చినా హిందీ సినిమాలు చేయను. కేవలం గౌరవం విషయంలోనే కాకుండా, కనీస వసతుల విషయంలో కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు చాలా ముర్కంగా వ్యవహరిస్తాయి. హోటల్ గదులు, విమాన టిక్కెట్లు, వ్యక్తిగత స్టాఫ్ విషయంలో కూడా బేరాలు ఆడతారు. అటువంటి ఆధిపత్యం ఉన్న చోట పని చేయడం నా వల్ల కాదు’ అని ఆమె కుండబద్ధలు కొట్టారు. అయితే సన్నీ డియోల్ వంటి వారు మాత్రం ఎంతో వినయంగా ఉంటారని, ఆయనతో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సిమ్రాన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.