నార్త్ ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, సిమ్రాన్ నిజంగా స్టార్ డమ్‌ను సౌత్ ఇండస్ట్రీ నుండే పొందారు. దాదాపు 30 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇండస్ట్రీ నుండి ఎంతో నేర్చుకున్నా, బాలీవుడ్‌లో తన పనితనం గుర్తించబడలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సిమ్రాన్ 1995లో ‘సనమ్ హర్జై’ తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. గోవిందా, సల్మాన్ ఖాన్, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ, ఆమె పనిచేసిన ప్రతిభ బాలీవుడ్ కోసం ఇంకా సరిగ్గా గుర్తించబడలేదని అన్నారు.
Also Read : Shruti Haasan : ఆమె మీద ఇష్టం తోనే నాన్న ఆ పని చేశారు..
ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ.. “హిందీ సినిమాలతో నా కెరీర్ ప్రారంభించాను, కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో నా పనితనం తెలియడం లేదు. కొన్ని ప్రాజెక్ట్స్‌కి ముందే టెస్ట్ వీడియోలు అడుగుతున్నారు. వారిలో కొంతమంది మంచిగా ఉన్న, కొంతమంది కనెక్ట్ కాలేకపోయారు. దానిని తప్పు పట్టడం లేదు” అని తెలిపారు. సిమ్రాన్ తెలిపిన ప్రకారం, సౌత్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యూనరేషన్, నార్త్ ఇండస్ట్రీలో ఇచ్చే రెమ్యూనరేషన్‌కు పదో వంతు మాత్రమే. అందుకే ఆమె ఎక్కువగా పరిచయం ఉన్న, తనను గుర్తించే ప్రాజెక్ట్స్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నారు. గుల్మోహర్ సినిమాలో సరిగ్గా కలిసిపోయారని, కానీ తదుపరి ప్రాజెక్ట్‌ల్లో అంతకు మించి కనెక్ట్ కాలేకపోయారని తెలిపింది.
ఇక సిమ్రాన్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో ప్రారంభమైనా, స్టార్డమ్ తెలుగు, తమిళ సినిమాలతో మాత్రమే వచ్చింది. ‘ది టూరిస్ట్ ఫ్యామిలీ’ తర్వాత చిన్న, మధ్యస్థాయి ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఇప్పటివరకు అవకాశాలు లభించలేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం సిమ్రాన్ ‘ది లాస్ట్ వన్’ సినిమాలో నటిస్తోంది. ఆమె అభిప్రాయం ప్రకారం, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నా, బాలీవుడ్ ఇంకా పూర్తిగా గుర్తించలేదు, ఇది ఆమె అసహనానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
