David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Reddy: టాప్ టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు మధ్య పరిశ్రమలో ఎంతో కాలంగా మంచి స్నేహబంధం ఉంది. (2013)లో వచ్చిన ‘పోటుగాడు’ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా, ఆయనపై వచ్చే సూపర్ హిట్ సాంగ్”బుజ్జి పిల్ల”ను శింబు స్వయంగా పాడారు. ఈ పాట అప్పట్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచి ఇద్దరి అభిమానులను అలరించింది. అలాగే టాలీవుడ్లో క్లాసిక్‌గా నిలిచిన ‘వేదం’ సినిమాలో మంచు మనోజ్ పోషించిన కేబుల్ రాజు పాత్రను, దాని తమిళ రీమేక్ ‘వానమ్’ చిత్రంలో శింబు చేయడం విశేషం. ప్రస్తుతం మంచు మనోజ్ సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. ఈ మూవీలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం శింబు ఎంట్రీ ఇస్తున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్నేహం ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ద్వారా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మనోజ్ కు అన్నయ్యగా శింబు?
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘డేవిడ్ రెడ్డి’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో తమిళ హీరో శింబు కూడా భాగం కానున్నారనే వార్త ఇప్పుడు మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో శింబు మనోజ్‌కు అన్నయ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే శింబు పాత్ర సినిమా మొత్తం ఉండదని, కేవలం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో మాత్రమే కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. కథలో కీలకమైన సమయంలో వచ్చే ఈ పాత్ర సినిమాకు ఎమోషనల్ కనెక్షన్‌ను తీసుకొచ్చేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Also Read
క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా..
ప్రస్తుతం ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్ర బృందం శరవేగంగా చిత్రీకరిస్తోంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేక సెట్స్‌తో పాటు కొన్ని ప్రత్యేక వాహనాలను కూడా సిద్ధం చేసింది.
700 కేజీల బైక్ ప్రత్యేక ఆకర్షణ
‘డేవిడ్ రెడ్డి’లో ఉపయోగించనున్న ‘వార్ డాగ్’ బైక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 700 కిలోల బరువు ఉండే ఈ ప్రత్యేకమైన బైక్‌ను సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. కథకు అనుగుణంగా ఈ బైక్‌ను డిజైన్ చేయడంతో సినిమాలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పీరియాడికల్ యాక్షన్ కథ కావడంతో అప్పటి కాలానికి సంబంధించిన వాతావరణం, ఆయుధాలు, వాహనాలు, యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ‘డేవిడ్ రెడ్డి’ మనోజ్ కెరీర్లో మరో విభిన్నమైన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుడి కథ?
‘డేవిడ్ రెడ్డి’ కథ స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన డేవిడ్ రెడ్డి అనే యోధుడి కథను ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. అయితే చిత్ర కథాంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా గోప్యంగానే ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ పోషిస్తున్న పాత్ర ఎలా ఉండబోతుంది? అతని పాత్రకు, శింబు పోషిస్తున్న అన్నయ్య పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ పాత్ర కథను ఏ విధంగా మలుపు తిప్పుతుంది? అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మనోజ్ సరసన ‘ప్రిన్స్’ హీరోయిన్
ఇక ఈ సినిమాలో మనోజ్‌కు జోడీగా తమిళ చిత్రం ‘ప్రిన్స్’ ఫేమ్ నటి మరియా నటిస్తున్నారు. విభిన్నమైన పీరియాడికల్ కథ, భారీ యాక్షన్, ప్రత్యేకమైన వార్ డాగ్ బైక్‌తో పాటు ఇప్పుడు శింబు ఎంట్రీ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతోంది. మంచు మనోజ్, శింబు మధ్య ఉన్న స్నేహం కారణంగా ఈ స్పెషల్ రోల్‌ను శింబు అంగీకరించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే శింబు పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది.
- Tags
- cinema
- David Reddy
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!