Site icon NTV Telugu

హాస్పిటల్ లో శింబు! కరోనా కాదట!!

తమిళ కథానాయకుడు శింబు నటించిన తాజా చిత్రం ‘మానాడు’ నవంబర్ 25న విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ యంగ్ హీరో అనారోగ్యంతో ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. దాంతో అతనికి కరోనా సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో విశేషంగా జరగడం మొదలైంది. గొంతు నొప్పితో శింబు హాస్పిటల్ లో చేరాడని, అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం శింబు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇప్పటికే ముంబైలో జరిగింది. ఇప్పుడు చెన్నయ్ లో షూటింగ్ జరుగుతోంది. శింబు అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరడంతో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడిందట. ఇదిలా ఉంటే… శింబు త్వరగా కోలుకోవాలని సినిమా జనంతో పాటు అభిమానులూ కోరుకుంటూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Exit mobile version