Site icon NTV Telugu

Kollywood: అసలు ఊహించని కాంబినేషన్ ఇది…

Kollywood

Kollywood

కొన్ని కాంబినేషన్ అవుట్ ఆఫ్ ది బ్లూ అనౌన్స్ అయ్యి అందరికీ షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే… “శింబు, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా”. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. మార్చ్ 30న పత్తు తల సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిన శింబుతో లోకనాయకుడు కమల్ హాసన్ ఒక సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘ఎస్‌టీఆర్ 48’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ ప్రొడ్యూస్ చేస్తుండగా ‘దేశింగ్ పెరియసామి’ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Also: Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?

శింబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని దాదాపు 100కోట్ల బడ్జెట్‌ తో రూపొందించనున్నారని సమాచారం. ఊహించని ఈ అనౌన్స్మెంట్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. విక్రమ్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన కమల హాసన్, తన బ్యానర్ లో ఇతర హీరోల సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి చాలా రోజులు అయ్యింది. ఇందులో భాగంగానే శింబుతో ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version