Site icon NTV Telugu

SIIMA 2025: దేవి శ్రీ ప్రసాద్‌కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన రేర్ కంప్లిమెంట్..

Dsp

Dsp

ప్రతి ఏడాది గ్రాండ్‌గా జరిగే SIIMA (South Indian International Movie Awards) ఈ సారి దుబాయ్ వేదికగా అద్భుతంగా ప్రారంభమైంది. స్టార్ స్టడెడ్ ఈవెంట్‌లో గ్లామర్, గ్లిట్టర్ తో పాటు సినిమాటిక్ మ్యాజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెడ్ కార్పెట్‌లో మెరిసిన సెలబ్రిటీలు, ప్రత్యేక అవార్డుల ప్రదర్శన, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లతో వేదిక రసవత్తరంగా మారింది.

అందరిలో ప్రత్యేకంగా నిలిచిన క్షణం మాత్రం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రశంస. దేవి ఇటీవల ‘ఉస్తాద్ భాగత్ సింగ్’ సినిమాకి ఒక సాంగ్ కంపోజ్ చేశారు. ఆ పాట షూట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనను కలసి హ్యాండ్‌షేక్ ఇస్తూ, “అదరకొట్టేసావు… చాలా కాలం తర్వాత మళ్లీ నాకు డాన్స్ చేయాలని కోరిక కలిగింది” అని ప్రశంసించారు. ఈ రేర్ కంప్లిమెంట్ దేవీ కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత ప్రశంసలు ఇవ్వరు. అలాంటి స్టార్ నుంచి అంత బలమైన ప్రశంస రావడం ఆయని ఉత్సాహ పరిచింది. దీనిపై ఆయన తన ఆనందాన్ని సైమా అవార్డు సందర్భంగా మీడియాలో పంచుకున్నారు. ఇక SIIMA 2025లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజికల్ జర్నీ, పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఈ గుర్తింపు ప్రత్యేక హైలైట్‌గా మారింది. మరోవైపు, రెడ్ కార్పెట్ నుండి స్టార్ హంగామా వరకు, ఈవెంట్‌లో జరిగిన ప్రతీ చిన్న అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version