NTV Telugu Site icon

Sidharth Kiara Wedding: సిద్- కియారా పెళ్లి ఫోటోలు వచ్చేసాయోచ్

Kiyara

Kiyara

Sidharth Kiara Wedding: హమ్మయ్య.. ఎట్టకేలకు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గత కొంత కాలంగా ప్రేమలో తేలిపోయిన ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ నేడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ కొద్దిసేపటి క్రితమే సిద్, కియారా ఎండలో మూడు ముళ్లు వేశాడు. ఎంతో రహస్యంగా వీరి పెళ్లి జరిగింది. ఇప్పటి వరకు వీరి పెళ్లి ఫోటోలు ఎక్కడా లీక్ కాకపోవడంతో సిద్- కియారా ఎలాంటి బట్టలు వేసుకున్నారు..? మూడు ముళ్లు వేసేటప్పుడు కియారా ఏడ్చిందా..? లేదా..? అంటూ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఆ ఎదురుచూపులకు సమాధానంగా సిద్దార్థ్.. పెళ్లి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తన జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. “ఇప్పుడు మేము శాశ్వతంగా బుక్ అయ్యాం.. మా కొత్త ప్రయాణానికి మీ ప్రేమ, ఆశీర్వాదాలు మాకు అందించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫోటోలు అలా వచ్చాయో లేదో ఇలా వైరల్ గా మారిపోయాయి. పెళ్లి కూతురుగా కియారా లుక్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. డిజైనర్ లెహంగా.. అందుకు తగ్గట్టు గ్రీన్ జ్యువెలరీ తో మెరిసిపోతోంది. ఇక సిద్ సైతం డిజైనర్ షేర్వాణీతో అద్భుతంగా ఉన్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇక అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Show comments