NTV Telugu Site icon

Dj Tillu: అర్జున్ దాస్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో టిల్లు అన్న సందడి…

Buttabomma

Buttabomma

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘బుట్టబొమ్మ’గా రీమేక్ చేస్తోంది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు లీడ్ కాస్ట్ గా నటించిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బుట్టబొమ్మ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగనుంది. డీజే టిల్లు అకా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. సిద్ధూ సీతారా ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ లో డీజే టిల్లు స్క్వేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: NTR 30: జనవరి 1న చెప్పారు… ఫిబ్రవరి 1 వచ్చింది… ఒక్క అప్డేట్ ఇవ్వండి సర్

టీజర్, ట్రైలర్ తో మెప్పించిన బుట్టబొమ్మ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 4న హిట్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. దీని నిజం చేస్తూ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ నెలకొని ఉన్నాయి. అయితే మైఖేల్ సినిమా రూపంలో బుట్టబొమ్మకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లు మైఖేల్ సినిమా పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంటే ఒక్క రోజు తర్వాత రిలీజ్ అయ్యే ‘బుట్టబొమ్మ’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

Reead Also: Tollywood: ‘మైఖేల్’తో మొదలు… ఇక తగ్గేదే లే!

Show comments