Site icon NTV Telugu

Siddhu Jonnalagadda : అప్పు చేసి రూ.4.75 కోట్లు ఇచ్చా.. సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్

Siddu

Siddu

Siddhu Jonnalagadda : యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రీసెంట్ గా నటించిన మూవీ జాక్. మంచి అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో భారీ నష్టాలు వచ్చాయని నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ అన్నారు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సిద్దు.. ఈ నష్టాలపై స్పందించారు. జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ మూవీ విషయంలో నాకు కూడా బాధేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పులు చేసి మరీ ఇచ్చాను. ఎందుకంటే ఆ టైమ్ లో నా చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. అవి ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆ డబ్బు ఇచ్చినందుకు నేను బాధపడట్లేదు.

Read Also : OG : అకీరాతో ఓజీ 2..? బాక్సులు బద్దలయ్యే న్యూస్ చెప్పిన సుజీత్

ఎందుకంటే ఆ సినిమాతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను అంటూ తెలిపాడు సిద్దు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన జాక్ సినిమాలో సిద్దుకు జంటగా వైష్ణవి నటించింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ మూవీ నష్టాలపై చాలా రకాల రూమర్లు వచ్చాయి. కానీ ఇన్ని రోజులు సిద్దు డబ్బులు ఇచ్చాడనే విషయం బయటకు రాలేదు. ఇప్పుడు స్వయంగా సిద్దు క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..

Exit mobile version