NTV Telugu Site icon

SVCC 37: సిద్ధూ- భాస్కర్ మొదలెట్టేశారు!

Svcc37 Shoot Begins

Svcc37 Shoot Begins

Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar and BVSN Prasad’s SVCC37 shoot begins: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో రాబోతోన్న ‘ఎస్వీసీసీ 37’ షూట్ ప్రారంభం కానుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ మల్టీ టాలెంటెడ్ అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఒక పక్క హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆయన డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధూ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న క్రమంలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని క్రమంలో వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు.

Highest Grossing Telugu Movies 2023: 2023లో అత్యధికంగా వసూళ్లు సంపాదించిన సినిమాల్లో బాలయ్య,, తేజ్ లదే హవా!

రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్‌లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు ముగ్గురూ కనిపిస్తున్నారు. నిజానికి చివరిగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు ముందు నుంచి చెబుతున్నారు. ఇక ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు ప్రకటించనున్నారు.

Show comments