Siddharth turns emotional and rolls on tears at stage టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్ తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారు అంటూ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్ కి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో పలు చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. ఈమధ్యనే తమిళంలో చిత్త అనే సినిమా చేసిన సిద్ధార్థ్ ఆ సినిమాను కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని విమర్శకులు సైతం కొనియాడారు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా అప్పుడే రిలీజ్ చేయాలనుకున్నా ఎవరూ కొనకపోవడంతో ఎట్టకేలకు ఈ వారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్దార్థ్ ఎమోషనల్ అయ్యాడు.
Tiger Nageswara Rao: పీఎం సెక్యూరిటీకే వణుకు పుట్టించిన టైగర్ నాగేశ్వరరావు
తమిళనాడులో రెడ్ జెయింట్ వాళ్ళు సినిమా చూసి ఇలాంటి గొప్పసినిమా చూడలేదని ఉదయనిధి
సినిమా కొన్నాడు. కేరళలో నెంబర్ 1 నిర్మాత గోకులం గోపాలం గారు సినిమా చూసి కొన్నారు, కర్ణాటకలో కేజీఎఫ్ సినిమా నిర్మాతలు సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదని నా సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికి వస్తే సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని అడిగారు, సిద్ధార్థ్ సినిమా ఎందుకు చూస్తారు అండి, ఎవరు చూస్తారు అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చూస్తే ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇది 28న రిలీజ్ కావాల్సిన సినిమా అని అన్నారు. ఆ సినిమా తెలుగు ప్రేక్షుకులు ఎందుకు చూస్తారు, ఎవరూ చూడరని తెలిసి నాకు కరెక్టుగా థియేటర్లు దొరకలేదు. ఆ టైంలో నాకు వచ్చి నేను నీతో ఉన్నానని చెప్పి నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసింది ఏషియన్ సునీల్ గారు అని అంటూ సిద్ధార్థ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా కంటే మంచి సినిమా నేను తీయలేను, దయచేసి సినిమా థియేటర్లకు వచ్చి సినిమా చూడండని కోరారు.