Siddarth and Aditi Rao Hydari to teamup for Harilo Ranga Hari: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి ఇద్దరు ప్రేమలో పడినట్లు కొంత నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ ఉండడంతో పాటు తమ రిలేషన్ గురించి వస్తున్న ఎలాంటి ప్రచారాలను ఖండించక పోవడంతో దాదాపు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళుతూ అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు.
Actor Prabhas: దెబ్బకు పేరు మార్చుకున్న ప్రభాస్.. అసలు నిజం ఇదా?
ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నట్టు సంక్రాంతి సందర్భంగా ఒక అధికారిక ప్రకటన చేసింది. సిద్ధార్థ హీరోగా అదితీ రావ్ హైదరీ హీరోయిన్ గా ప్రేమ ఇష్క్ కాదల్, సేనాపతి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి దయ అనే వెబ్ సిరీస్ తో మరింత పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాదినేని ఒక సినిమా అనౌన్స్ చేశారు. హరిలో రంగ హరి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఓ బేబీ, షాకినీ డాకిని సినిమాల నిర్మాత సునీత తాటి నిర్మించబోతున్నారు. నిజానికి సిద్దార్థ్ కి గతంలోనే వివాహం అయి విడాకులు కాగా ఆడిట్ రావు హైదరీకి కూడా గతంలో వివాహం జరిగి విడాకులు అయ్యాయి. ఆ తరువాత కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడడంతో త్వరలో ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. ఈ జంట ఎప్పుడు ఒక్కటవుతుందో వేచి చూడాలి మరి.