Site icon NTV Telugu

‘సిరివెన్నెల’ చివరి పాట ఎప్పుడొస్తుందో చెప్పిన ‘శ్యామ్ సింగరాయ్’

shyam singharoy

shyam singharoy

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ‘శ్యామ్ సింగరాయ్’ బృందం ఈ పాట వెనుకున్న కష్టాన్ని తెలుపుతూ సాంగ్ రిలీజ్ డేట్ ని తెలిపారు. నాని, దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ ” శాస్త్రి గారు ఈ సినిమాలో రెండు పాటలు రాశారు.. ఈ పాట ఆయన రాసిన చివరి పాట.. ఈసొంగ్ వెనుక ఉన్న నేపథ్యం గురించి రాహుల్ చెప్తే బావుంటుందని నాని తెలిపాడు. రాహుల్ మాట్లాడుతూ ” నవంబర్న 3 న ఈ పాట గురించి సిరివెన్నెల గారు కాల్ చేసి ఆరోగ్యం సహకరించక పాటను పూర్తి చేయలేనేమో వేరే వారితో రాయిద్దామని అన్నారు.. ఆ తర్వాత నవంబర్ 4 దీపావళి రోజు ఉదయం ఫోన్ చేసి పల్లవి రాసుకో అన్నారు.. అంత సడన్ గా ఆయన రాసుకో అనగానే పక్కనే మహాభారతం పుస్తకం ఉంటే దానిమీదే 6 లైన్లు సిరివెన్నెల గారు చెప్పింది రాసేశాను.

ఆ పల్లవిలో మొదటి పదం సిరివెన్నెల.. ఎందుకు సర్ మొదటి పదంలోనే మీ సంతకం ఇచ్చారు అని అడిగాను..బహుశా ఇదే నా ఆఖరి పాట కావచ్చు అని నవ్వారు.. విచిత్రం ఏంటంటే .. ఆయన అంత్యక్రియలు జరిగినరోజే ఈ పాట రికార్డ్ చేశాం.. పాట చాలా బాగా వచ్చింది అందుకే మీ పేరే పెట్టుకున్నాం.. సిరివెన్నెల అని ఎమోషనల్ అయ్యాడు. చివరగా ఈ ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని సిరివెన్నెల గారికి అంకితం ఇస్తున్నట్లు నాని తెలిపాడు.. ఆయన రాసిన ఈ పాటను డిసెంబర్ 7 న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సాంగ్ నాని, సాయి పల్లవిల మధ్య వస్తుందని పోస్టర్ లో తెలిపారు.. నెలరాజును.. ఇలరాణిని కలిపిందికదా .. సిరివెన్నెల అంటూ సాగే ఈ పాట సిరివెన్నెల చివరి పాట కావడంతో ఈ పాట కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version