ఆ ‘సిరివెన్నెల’తో ప్రారంభం… ఈ సిరివెన్నెలతో ముగింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1986లో ‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలూ రాస్తూ, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు సీతారామశాస్త్రి. 2021 నవంబర్ 30న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రం ఏమంటే… ‘సిరివెన్నెల’తో మొదలైన ఆయన సినీ గీత ప్రస్థానం తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కోసం రాసిన పాటలో సిరివెన్నెల ప్రస్తావనతో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.
విశేషం ఏమంటే… తన పాటల్లో సిరివెన్నెల అనే పదాన్ని సీతారామశాస్త్రి ఎప్పుడు ప్రాధాన్యమిచ్చి వాడలేదు. కానీ ఇవాళ విడుదలైన పాటను ఎత్తుకోవడమే ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’ అని మొదలు పెట్టారు. పాటలోని ప్రతి పదంలోనూ సిరివెన్నెల సీతారామశాస్త్రి ముద్ర కనబడుతూ సాగింది. దీనిని వినగానే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ‘మీ తొలిచిత్రం పేరును ఈ పాటలో పెట్టారేమిటీ?’ అని ప్రశ్నించాడట. ‘బహుశా ఇదే నా చివరి పాట కావచ్చు’ అని సీతారామశాస్త్రి గట్టిగా నవ్వేస్తూ అన్నారట. నవంబర్ 4వ తేదీ దీపావళిన ఆ పాటను సీతారామశాస్త్రి పూర్తి చేయగా, డిసెంబర్ 1న సీతారామశాస్త్రి అంత్యక్రియల రోజున ఈ పాటను ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్ రికార్డ్ చేసింది.
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
నాని, సాయిపల్లవిపై చిత్రీకరించిన వీనుల విందైన ఈ గీతాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా రాయగా, అంతే గొప్పగా మిక్కీ జే మేయర్ స్వర రచన చేశారు. దీన్ని అనురాగ్ కులకర్ణి చక్కగా గానం చేశారు. ‘సిరివెన్నెల చివరి సంతకం’ పేరుతో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. కృతీశెట్టి, మడోన్నా సబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ నెల 24న సినిమా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!