నేచురల్ స్టార్ నాని హీరోగా బోయనపల్లి వెంకట్ నిర్మించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఇందులో పాటలు వీక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ రాయల్ ఈవెంట్ ను ఈ నెల 14న వరంగల్ లోని రంగలీల మైదానంలో సాయంత్రం 5 గంటలకు గ్రాండ్ గా జరుపబోతున్నారు. నానితో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతోంది.
