NTV Telugu Site icon

The EYE : వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శృతి హాసన్ హాలీవుడ్ సినిమా ‘ది ఐ’

Sruthi

Sruthi

ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ గ్రాండ్‌గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది.

డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం చేసే ప్రయాణమే ఈ ‘ది ఐ’. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు వచ్చే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిగా ఉండబోతోన్నాయని టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చకునేందుకు భార్య చేసి త్యాగాలు ఏంటి? ప్రయత్నాలు ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రీస్, ఏథెన్స్, కోర్ఫులోని అందమైన లొకేషన్‌లో చిత్రీకరించిన సీన్లు ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నాయి. 2023లో లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో‘ది ఐ’ని ప్రదర్శించిన తర్వాత ప్రాజెక్ట్‌పై అందరిలోనూ మరింతగా ఆసక్తి నెలకొంది.

ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోని ప్రొడక్షన్ హౌస్‌లో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించడం విశేషం. చలనచిత్ర పరిశ్రమలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది’ అని అన్నారు.

వేలిముద్ర కంటెంట్ గురించి
ఫింగర్‌ప్రింట్ కంటెంట్ అనేది అద్భుతమైన కంటెంట్‌ను ఆడియెన్స్‌కు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తుంది. సామాజిక సమస్యలను తెరపైకి తీసుకు వచ్చి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. చిత్రీకరించే విధానంలో మార్పును తీసుకురావడం, ప్రపంచంలోని అత్యంత ఉత్తేజకరమైన కథకులకు వారి లోతైన అభిరుచిని తీసుకురావడం, అసమానత, జాతి, లింగం బేధాలు లేకుండా అందరినీ అలరించేలా ప్రాజెక్ట్‌లు రూపొందించడమే లక్ష్యంగా వెళ్తోంది. దేశీయ మరియు ప్రపంచ మార్కెట్ల కోసం లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి మేము అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో దూరదృష్టి గల సృష్టికర్తలను అభివృద్ధి చేస్తాము, ఉత్పత్తి చేస్తాము మరియు పెట్టుబడి పెట్టాము. మా బృందం అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రపంచ స్థాయి కంటెంట్‌ను సిద్దం చేసేందుకు సన్నద్దంగా ఉంది.